: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కట్టుబడి వున్నాం: బీజేపీ
శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడి వుందని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఆ పుణ్యస్థలంలో రామాలయ నిర్మాణం జరగాలనేది కోట్లాది హిందువుల ఆకాంక్ష అని ఆయన అన్నారు. విశ్వహిందూ పరిషత్ కేంద్ర సలహా కమిటీ సమావేశం నిన్న అలహాబాదు నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు ఆ విధంగా మాట్లాడారు. కాగా, అయోధ్యలోని ఆలయ నిర్మాణ భూభాగాన్ని శ్రీరామ జన్మభూమి న్యాస్ కు అప్పగించేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని ఈ సందర్భంగా వీహెచ్పీ డిమాండ్ చేసింది.