: నోబెల్ కు నామినేట్ అయిన మలాల


సంవత్సరం కిందట బాలికల విద్యపై తాలిబన్లు విధించిన ఆంక్షల్ని వ్యతిరేకించి, తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడి, బ్రిటన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్థానీ పాఠశాల విద్యార్ధిని మలాల యూసఫ్ జాయ్ పేరు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. మలాల స్కూల్ బస్ లో ప్రయాణిస్తున్న సమయంలో దగ్గర నుంచి తాలిబన్లు కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ఈ సంఘటనతో మలాల పేరు అంతర్జాతీయంగా మారుమోగిపోయింది. ఆమె ధైర్యసాహసాలకు ప్రపంచ ప్రజలు నీరాజనాలు పట్టారు.
కాగా, 
నేటితో నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ గడువు ముగిసింది. అక్టోబర్ మొదటి వారంలో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News