: బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలువురు బాలీవుడ్ నటులు భారతీయ జనతా పార్టీ తరపున బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నటుడు పరేశ్ రావల్ కూడా బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా ఖరారయ్యాడు. అహ్మదాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నారు. నరేంద్ర మోడీకి సన్నిహితుడయిన పరేశ్ గత ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారట. దాంతో, ఇప్పుడు ఏకంగా పార్టీ టికెటే ఇచ్చారు. కాగా, మోడీపై ఓ ఎన్ఆర్ఐ నిర్మిస్తున్న సినిమాలో పరేశే మోడీ పాత్రను పోషిస్తుండటం విశేషం.