: ఏటీఎంలకు ముప్పుంది, జాగ్రత్త: మైక్రోసాఫ్ట్


విండోస్ ఎక్స్ పీకి రక్షణ చర్యలను ఉపసంహరిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ కావాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. ఎక్స్ పీని 2001లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది. బాగా వెనుకబడిపోవడంతో వచ్చే నెల 8 నుంచి సపోర్ట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో లక్ష వరకు ఏటీఎంలు ఉంటాయని అంచనా. వీటిలో ఎక్కువ భాగం విండోస్ ఎక్స్ పీ పైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జనరల్ మేనేజర్ అమ్రిష్ గోయెల్ తెలిపారు. కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ అవకపోతే భద్రతా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బ్యాంకులు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని రిజర్వ్ బ్యాంకు కూడా సూచించింది.

  • Loading...

More Telugu News