: ఉపాధ్యాయుడికి బడితె పూజ
నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం డీకంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయుడు రఘుపతిపై గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. బడితె పూజ చేసిన గ్రామస్థులు అతడ్ని తరగతి గదిలోనే నిర్బంధించారు.