: ప్రపంచ రికార్డు సమం చేసిన భారత కెప్టెన్


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిన్న వెస్టిండీస్ తో టీ20 మ్యాచ్ ద్వారా ఓ వరల్డ్ రికార్డును సమం చేశాడు. మిర్పూర్ లో జరిగిన ఈ పోరులో మార్లోన్ శామ్యూల్స్ ను స్టంపౌట్ చేయడం ద్వారా ధోనీ ఖాతాలో 127 స్టంపింగ్స్ చేరాయి. ఇంతకుముందు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర కూడా సరిగ్గా ఇన్నే స్టంపింగ్స్ తో వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. నిన్నటి మ్యాచ్ ద్వారా ధోనీ... సంగక్కర సరసన చేరినట్టయింది. అయితే, ఈ విషయంలో అన్ని ఫార్మాట్లు కలిపి సంగక్కరకు 639 ఇన్నింగ్స్ లు అవసరం కాగా, ధోనీ 439 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.

  • Loading...

More Telugu News