: సంజయ్ తో పాటు నాకు కూడా క్షమాభిక్ష పెట్టండి: మరో అపరాధి


సినీ నటుడు సంజయ్ దత్ తో పాటు తనకూ క్షమాభిక్ష పెట్టాలంటూ, 1993 ముంబయి పేలుళ్ల కేసులో ఐదేళ్ల శిక్ష పడిన మరొక అపరాధి జైబున్నీసా విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ కు దరఖాస్తు చేసుకుంది. 20 సంవత్సరాలుగా జీవితంతో పోరాడుతున్నానని, ఇకముందు జైల్లో ఉండలేనని 70 ఏళ్ల ఈ వృద్ధురాలు తన దరఖాస్తులో పేర్కొంది.

ఇప్పటికే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న తాను సరిగా నడవలేనని కూడా తెలిపింది. తన పరిస్థితిని అర్ధం చేసుకుని కేసు నుంచి తనకు విముక్తి ప్రసాదించాలని ఆమె దీనంగా అర్ధిస్తోంది. ఇదిలావుంటే, సంజయ్ కు క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్ కు ఉందంటూ విషయాన్ని తెరపైకి తెచ్చిన ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ, ఇప్పుడు జైబున్నీసాకు కూడా మద్దతు పలుకుతున్నారు.

  • Loading...

More Telugu News