: డబ్బు కోసమే నామినేషన్లు వేస్తున్నారు: జేసీ
జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చెండాడుతున్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, కేవలం డబ్బు కోసమే కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు వేస్తున్నారని అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి సీన్ లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బు కోసమే నామినేషన్లు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మట్టికొట్టుకుపోయిందని విమర్శించారు. ఢిల్లీ నుంచి 20, 30 లక్షల రూపాయలు వస్తాయనే ఆశతో అసెంబ్లీకి ఎవరైనా నామినేషన్ వేసే అవకాశం ఉందని తెలిపారు.