: నా మద్దతు మోడీ ఒక్కరికే: పవన్ కల్యాణ్
తాను పలు పార్టీలతో జట్టు కడుతున్నట్టు వదంతులు, విమర్శలు వస్తుండడంతో సినీ నటుడు పవన్ కల్యాణ్ వాటికి తెరదించే ప్రయత్నం చేశారు. తానిప్పటి వరకు టీడీపీ సహా ఏ ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. మోడీ, జనసేన మధ్య సత్సంబంధాలు ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని తెలియజేస్తూ బీజేపీ సీమాంధ్ర నేత సోము వీర్రాజుకు పవన్ కల్యాణ్ లేఖ రాశారు. మోడీ, పవన్ మధ్య భేటీ ఏర్పాటు చేసింది వీర్రాజే కావడంతో... పవన్ ఆయనకే లేఖ రాశారు. దీనిపై ఆయన పవన్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా కుదరకపోవడంతో ఆ లేఖను అధిష్ఠానానికి పంపించారు.