: వారణాసిలో మోడీ పోస్టర్లకు తారు


వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటోంది. మోడీ స్థానికేతరుడని, గుజరాత్ వెళ్లిపోవాలని విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. వారణాసిలో బీజేపీ యేతర పార్టీలన్నీ 'మోడీ గో బ్యాక్ టు గుజరాత్' అంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి. వారణాసిలో పలు చోట్ల నరేంద్ర మోడీ పోస్టర్లపై సమాజ్ వాదీ కార్యకర్తలు తారు పూసారు. నరేంద్ర మోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీలో దిగనున్న సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించింది. మరో వైపు బీజేపీ యేతర పార్టీలన్నీ ఉమ్మడి అభ్యర్థిని మోడీపై పోటీకి బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News