: పసివాడి ప్రాణం తీసిన నిమ్మకాయ


అభం శుభం తెలియని ఆ పసివాడు ఆడుకుంటూ వెళ్లి నిమ్మకాయను మింగాడు. నిమ్మకాయ గొంతుకు అడ్డం పడి పది నెలల ఆ బాలుడు కన్నుమూసిన విషాద ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. మద్దిలపాలెం నివాసులైన కనకేశ్వరరావు, వరలక్ష్మిల కుమారుడు రోహన్ సాయి మరణంతో ఆ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.

కనకేశ్వరరావు ఆర్మీ ఉద్యోగి. వరలక్ష్మి ఆదివారం నాడు కశింకోట మండలంలోని ఇందిరా కాలనీలోని పుట్టింటికి వచ్చింది. ఈ రోజు ఉదయం రోహన్ సాయి ఆడుకుంటూ పక్కనే ఉన్న నిమ్మకాయను మింగడంతో ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News