: ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే... మన పరిస్థితి ఏమిటి?


ఈ సమయంలో శత్రుదేశాలు భారత్ పై దండెత్తితే? మన సైనికులు దేశాన్ని రక్షించగలరా? కచ్చితంగా రక్షించగలరని గుండెమీద చెయ్యేసుకుని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే... మన సైన్యం వద్ద తగినంత మందుగుండు సామాగ్రి లేదు మరి. ప్రపంచంలోనే రెండో పెద్ద సైనికదళమైన భారతీయ ఆర్మీని మందుగుండు కొరత వేధిస్తోంది. ఒక అంచనా ప్రకారం గట్టిగా 20రోజుల యుద్ధానికి సరిపడా వనరులు కూడా లేవని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం 40 రోజులకు సరిపడా వనరులు ఉండాలి. ఇటీవల సైన్యాధ్యక్షుడు జనరల్ బిక్రం సింగ్ ఒక వాస్తవాన్ని ఆన్యాపదేశంగా బయటపెట్టారు. కొత్త ఆయుధ ప్రణాళిక ప్రకారం ఆర్మీకి తగినన్ని నిధులు కేటాయిస్తే.. 2015 నాటికి యుద్ధ వనరుల నిర్వహణలో సగం శాతాన్నైనా చేరుకుంటామన్నారు. అంటే ప్రస్తుతం 20 రోజులకు సరిపడా ఆయుధ, మందుగుండు సామాగ్రి లేనట్లు ఆయన చెప్పకనే చెప్పారు.

  • Loading...

More Telugu News