: శ్రీరామ్ సేన అధ్యక్షుడికి బీజేపీ నుంచి అవమానం


హిందూ సంప్రదాయాలను తుంగలో తొక్కి పాశ్చాత్య సంస్కృతి వెంట పరుగులు తీసే వారిపై దాడులతో శ్రీరామ్ సేన ఆ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. కర్ణాటకలోని మంగళూరులో 2009లో ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్ సేన కార్యకర్తలు దాడి కూడా చేశారు. ఆ కేసులో సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ నిందితుడిగా ఉన్నారు. హిందూ భావజాలం కావడంతో బీజేపీలో చేరాలనుకున్నారు. మనవాడే కదా అనుకుని కర్ణాటక బీజేపీ నేతలు కూడా ఆహ్వానించారు.

మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో ప్రమోద్ ముతాలిక్ చేరారు. ఇంకేముంది, ప్రతిపక్ష నేతలు వాగ్బాణాలు సంధించారు. మహిళల హక్కులపై బీజేపీ నేతల వైఖరేమిటో ఇది తెలియజేస్తోందని కాంగ్రెస్ నేత అంబికాసోనీ అన్నారు. సీపీఎం నేత బృందా కారత్ కూడా విమర్శించారు. దీంతో బీజేపీ అధిష్ఠానం ప్రమోద్ ముతాలిక్ చేరికను ఆమోదించలేదు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. ఇంకేముంది మెడపట్టి బయటకు గెంటేసినంతగా ప్రమోద్ ను బయటకు గెంటేశారు.

  • Loading...

More Telugu News