: సీపీఐతో పొత్తుపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి పోటీచేయాలనుకుంటున్న సీపీఐ కొన్ని రోజుల నుంచీ పొత్తుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పార్టీ చేస్తున్న డిమాండ్ కు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించింది. దాంతో, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాదుకు రాగానే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో భేటీ కానున్నారు. ఒక ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది.

  • Loading...

More Telugu News