: స్కూల్ విద్యార్థుల వీపులపై నడచి వెళ్లిన బీజేపీ నేత


గుజరాత్ కు చెందిన ఒక బీజేపీ నేత. ఏం చేశాడో తెలుసా? పాఠశాల విద్యార్థులు వరుసగా వంగొని ఉంటే వారి వీపులపై నడచుకుంటూ వెళ్లాడు. మోడీ స్వరాష్ట్రంలోని రాజ్ కోట్ లో ఈ సంఘటన జరిగింది. అలా నడచిన నేత బీజేపీ తరపున రాజ్ కోట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మోహన్ కుందారియా కావడంతో విమర్శలు పెరిగిపోయాయి. వాట్స్ యాప్ ద్వారా ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకిపోయింది. ఆర్య సమాజం నిర్వహించిన యోగా శిక్షణ శిబిరానికి వచ్చిన కుందారియా... నిర్వాహకులు కోరడంతో కాదనలేక అలా సర్కస్ ఫీట్ చేశారు. విద్యార్థుల యోగా నైపుణ్యాన్ని తెలియజేయడానికే ఈ ఫీట్ చేశానని కుందారియా సమర్థించుకోవడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News