: విభజన బాధాకరం: రఘువీరా
కాంగ్రెస్ లో ఉంటూనే విభజనను వ్యతిరేకించిన పలువురు నేతలు నిరసనగా బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పార్టీలో కొనసాగుతూ.. సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి తాజాగా విభజనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన బాధాకరమని విజయవాడలో చెప్పారు. అయితే, ఈ విషయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కాలయాపన చేయడం తగదని సూచించారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలని, రాష్ట్రానికి మేలు చేసే డాక్యుమెంటును సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సాగు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ సర్వాంతర్యామి అని, పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం, దేశం బాగుపడతాయని పేర్కొన్నారు.