: మోడీ కీర్తనపై ద్వారకా పీఠాధిపతి తీవ్ర ఆగ్రహం
హర్ హర్ మోడీ ఇదో కొత్త జపం. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని కీర్తిస్తూ తెరపైకి వచ్చిన నామస్మరణ. మోడీపై భక్తితో హరహర మహాదేవ కాస్తా హర్ హర్ మోడీ అయిపోయింది. దీనిపై ద్వారకా పీఠాధిపతి, శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను పిలిచి తన అభ్యంతరాన్ని తెలియజేశారు. ఇది పరమేశ్వరుడిని అవమానించడమేనన్నారు. వ్యక్తి పూజను ఆపివేయాలని సూచించారు. స్వామితో మోహన్ భగవత్ కూడా ఏకీభవించారు. దీంతో మోడీ ఇకపై హర్ హర్ మోడీ జపం చేయవద్దని ట్విట్టర్లో కోరారు.