: బేగంపేటలోని అపార్ట్ మెంట్లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాదు, బేగంపేటలోని షాపర్స్ స్టాప్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రెండో అంతస్థులో ఉన్న బ్యూటీపార్లర్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.