: పందెం కోసం సిగరెట్ లైటర్ మింగాడు, ఆసుపత్రి పాలయ్యాడు!


చైనాలో ఓ యువకుడు 800 యువాన్ల (రూ.7794) కోసం సిగరెట్ లైటర్ మింగి ఆసుపత్రి పాలయ్యాడు. ఝెజియాంగ్ ప్రావిన్స్ లోని నింగ్ బో నగరంలో ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఈ యువకుడు రూం రెంట్ కట్టేందుకు నానా అగచాట్లు పడేవాడు. ఓరోజు సహచరుడితో రెస్టారెంట్ పక్కన నిలుచుని ఉండగా, లైటర్ మింగితే 800 యువాన్లు దక్కించుకోవచ్చని మరో వ్యక్తి పందెం కాశాడు. దీంతో, ఆ రెస్టారెంట్ కార్మికుడు మరేమీ ఆలోచించకుండా సిగరెట్ లైటర్ మింగేశాడు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఆ లైటర్ బయటికి తీశారు. అదృష్టవశాత్తు ఆ లైటర్ ఉదర భాగాలకు ఎటువంటి నష్టం కలగజేయలేదని ఓ వైద్యుడు తెలిపాడు. సకాలంలో బయటికి తీయకుంటే ప్రమాదం వాటిల్లేదట.

  • Loading...

More Telugu News