: వకాస్ అరెస్టు గొప్ప విజయం, మోడీకి ముప్పులేదు: షిండే
రాజస్థాన్ లో పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదుల్లో యాసిన భత్కల్ ముఖ్య అనుచరుడు వకాస్ అహ్మద్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ అరెస్టుపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ, వకాస్ అరెస్టు గొప్ప విజయమని అభివర్ణించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా ఏ నాయకుడూ ఇక భయపడాల్సిన పని లేదని షిండే పేర్కొన్నారు. వకాస్ అరెస్టుతో భారత్ లో పేలుళ్ళ కేసుల్లో దర్యాప్తు ఊపందుకుంటుందని తెలిపారు. ఇండియన్ ముజాహిదిన్ చేపట్టిన పలు బాంబు పేలుళ్ళతో వకాస్ కు సంబంధాలున్నాయి. పాకిస్తానీ అయిన వకాస్ 2010లో అసదుల్లా అక్తర్ తో కలిసి తొలిసారి భారత్ వచ్చాడు.