: 'జంజీర్' లో అతిథి పాత్రకు 'నో' చెప్పిన బిగ్ బి
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం బాలీవుడ్ లో 'జంజీర్' తో ప్రభంజనం సృష్టించిన అమితాబ్ బచ్చన్.. ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించేందుకు అంగీకరించలేదట. ఓ అతిథి పాత్రలో నటించమని చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా.. బిగ్ బిని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అమితాబ్ ఈ చిత్రంలో నటిస్తారని ఎదురుచూసిన చిత్ర బృందానికి ఆయన నిర్ణయం నిరాశ కలిగించింది.
ఊపిరి సలపని షెడ్యూల్ కారణంగానే ఈ సినిమాలో అమితాబ్ నటించడంలేదట. ఈ విషయమై దర్శకనిర్మాత అపూర్వ లఖియా మాట్లాడుతూ, 'అమితాబ్ లాంటి నటదిగ్గజం తమ చిత్రంలో ఉన్నాడని చెప్పుకోవడం ఏ ఫిల్మ్ మేకర్ కు అయినా గొప్ప గౌరవం. అయితే, ఆయన 'జంజీర్' లో నటించబోవడంలేదు' అని చెప్పుకొచ్చాడు.