: ఆసీస్ ముందు భారీ లక్ష్యం ఉంచిన పాక్
ఉమర్ అక్మల్ (94) భారీ ఇన్నింగ్స్ సాయంతో పాకిస్థాన్ జట్టు ఆసీస్ ముందు 192 పరుగుల లక్ష్యాన్నుంచింది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా మిర్పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఉమర్ స్కోరు 9 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి. ఇక, చివర్లో అఫ్రిది 11 బంతుల్లో 2 ఫోర్లు ఓ సిక్సు సాయంతో చకచకా 20 పరుగులు చేయడం విశేషం.