: ఈ నెల 28న ప్రాథమిక జాబితా: దిగ్విజయ్
రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిందని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28న ప్రాథమిక జాబితా రూపొందిస్తామని చెప్పారు. ఆ తర్వాత సీమాంధ్ర అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఖరారు చేస్తామని, 30 నాటికి తెలంగాణ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని వివరించారు.