: అద్వానీజీకి చాయిస్ ఇచ్చాం, ఆయన గాంధీనగర్ ఎంచుకున్నారు: వెంకయ్య


బీజేపీలో సీనియర్ నేతలను పక్కనబెడుతున్నారన్న విమర్శలపై ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. తాము సీనియర్ నాయకులను పక్కనబెట్టే ప్రశ్నేలేదన్నారు. పార్టీలో విభేదాలు లేవని, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సీనియర్ నేత అద్వానీకి చాయిస్ ఇచ్చామని, ఆయన గుజరాత్ లోని గాంధీనగర్ ఎంచుకున్నారని తెలిపారు.

ఇక టికెట్ దక్కని కారణంగానే జశ్వంత్ సింగ్ ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆయనను ఎల్లప్పుడూ గౌరవించిందని, రాజ్యసభకు పంపిందని వెంకయ్య వివరించారు. పార్టీ ఆయనను ఆర్ధిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమించిందని... ఇక పక్కనబెట్టింది ఎక్కడని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News