: ఆ నాలుగు పార్టీలకు గుణపాఠం చెప్పాలి: కిరణ్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం చేరుకున్నారు. కైకలూరు, ముదినేపల్లిలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించిన కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆ నాలుగు పార్టీలే విభజనకు కారణమని ఆరోపించారు. సమైక్య ఉద్యమస్ఫూర్తితోనే పార్టీని స్థాపించానని పేర్కొన్నారు.