: పుజారా, అశ్విన్.. ర్యాంకుల్లో పైపైకి..


ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో అద్భుతమైన ఆటతీరు కనబర్చిన యువ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో కెరీర్ బెస్ట్ సాధించారు. కంగారూ బౌలర్లను ఓ ఆటాడుకున్న పుజారా నేడు ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకుల్లో 5 స్థానాలు ఎగబాకి కెరీర్లో అత్యుత్తమంగా 7వ ర్యాంకుకు చేరుకున్నాడు.

ఇక అశ్విన్ కూడా తన ర్యాంకును బాగా మెరుగుపరుచుకున్నాడు. 2 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకులో నిలిచాడు. కాగా, బ్యాటింగ్ ర్యాంకుల్లో హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా), బౌలింగ్ ర్యాంకుల్లో డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానాల్లో ఎలాంటి మార్పులేదు.

  • Loading...

More Telugu News