: ఉక్రెయిన్ వెళ్ళొద్దు... దేశస్తులకు బ్రిటన్ హెచ్చరిక


ఎంతో అత్యవసరమైతే తప్ప ఉక్రెయిన్ వెళ్ళరాదని బ్రిటన్ తన దేశస్తులకు హెచ్చరిక జారీ చేసింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న దృష్ట్యా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. అంతేగాకుండా క్రిమియాలో ఉన్న బ్రిటిష్ జాతీయులు అక్కడి నుంచి వచ్చేయాలని స్పష్టం చేసింది. క్రిమియాలో ఉన్న బ్రిటిష్ జాతీయులకు ఎలాంటి దౌత్యపరమైన సాయం చేయబోమని తెలిపింది. ఉక్రెయిన్ పరిణామాలు త్వరితగతిన మార్పు చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News