: సీమాంధ్రలో కాంగ్రెస్ ఎన్నటికీ కనుమరుగు కాదు: డీఎస్
ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీతో డీఎస్ భేటీ ముగిసింది. అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో కాంగ్రెస్ ఎన్నటికీ కనుమరుగు కాదని చెప్పారు. ఇక, ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. గతంతో పోలిస్తే ఈ పర్యాయం బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ ఉదయం స్క్రీనింగ్ కమిటీ పిలుపుతో డీఎస్ హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్ళిన సంగతి తెలిసిందే.