: బాబుపై ఉద్యోగ సంఘాల ఆపేక్ష


టీడీపీతో కలిసి నడిచేందుకు ఏపీఎన్జీవోలు ఉత్సాహం కనబరుస్తున్నారు. హైదరాబాదులో జరిగిన ఏపీజేఎఫ్ 'మీట్ ద పీపుల్' కార్యక్రమంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ... ఇంతకుముందు టీడీపీకి, ఉద్యోగులకు కొంత ఎడం ఉండేదని తెలిపారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుకోవడంలేదని చెప్పారు.

అభివృద్ధి కోసం టీడీపీ ఒకడుగు ముందుకు వేస్తే, తాము రెండడుగులు వేసి సహకరిస్తామని అశోక్ బాబు స్పష్టం చేశారు. బాబు నుంచి కొత్త ఉద్యోగాల కల్పన, ఉద్యోగ భద్రతపై మాట కోసం తాము ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ బాబు... చంద్రబాబుతో ముఖాముఖీ మాట్లాడారు. ఉద్యోగుల పట్ల టీడీపీ విధివిధానాల వివరాలను తెలపాలని ఆయన బాబును కోరారు.

  • Loading...

More Telugu News