: 236 కోట్లు పలికిన పికాసో బొమ్మ


వేలం వెర్రి అంటే ఇదేనేమో... ఓ చిత్రకారుడు గీసిన ఓ బొమ్మ 236 కోట్ల పైచిలుకు రేటు పలికింది. వివరాల్లోకి వెళితే... ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో 1932లో వేసిన 'ఉమన్ సిటింగ్ నియర్ ఎ విండో' అనే కళాఖండాన్ని తాజాగా లండన్లో వేలం పాటకు పెట్టారు.

పెయింటింగు లంటే పడిచచ్చే ధనికులైన రసజ్ఞులు ఆ చిత్ర రాజం కోసం పాట పాడుతూ ఎగబడ్డారు. ఈ పోటీలో ఓ ఆసామీ అందరి కంటే ఓ అడుగు ముందుకేసి, 28.5 మిలియన్లకు (అంటే సుమారు 236 కోట్లు) హై పిచ్ లో పాట పాడేసి, దానిని సొంతం చేసుకున్నాడు. అందుకే అంటారు... ఎవరి పిచ్చి వాళ్లదని... ఏమంటారు?  

  • Loading...

More Telugu News