: వ్యభిచారం చేయనన్నందుకు రాడ్లతో దాడి
బతుకుదెరువు కోసం గుజరాత్ నుంచి ముంబై వచ్చిన 23 ఏళ్ల యువతి దారుణరీతిలో దాడికి గురైంది. ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ముగ్గురు యత్నించారు. అందుకు ఆమె తిరస్కరించగా రాడ్లతో తీవ్రంగా కొట్టారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలో ఇది శుక్రవారం రాత్రి జరిగింది. తీవ్రంగా కొట్టడంతోపాటు బాధితురాలి దేహంలో ఒక భాగాన్ని కూడా కోసేశారని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి బాధితురాలు థానే సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.