: సీఎం పదవిపై హామీ ఇవ్వనందుకే కేసీఆర్ యూ టర్న్: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. విభజన అనంతరం జరిగిన చర్చల్లో సీఎం పదవిపై హామీ ఇవ్వనందునే కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదని వివరించారు. ఇక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేవనెత్తిన 10 అంశాలపై చర్చకు తాము సిద్ధమని పాల్వాయి సవాల్ విసిరారు.