: కోమటిరెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయం: పాల్వాయి
మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి గతంలో అధినేత్రి సోనియాపై చేసిన వ్యాఖ్యలు, ఇతర పార్టీలతో జరిపిన సంప్రదింపులు హైకమాండ్ కు తెలుసునని పాల్వాయి పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరులు కాంట్రాక్టుల పేరిట కోట్లు కూడబెట్టారని ఆయన ఆరోపించారు.