: లంక ఆటగాళ్ల నిషేధంపై మురళీధరన్ అసహనం


శ్రీలంకలో తమిళుల వ్యవహారం నేపథ్యంలో లంక ఆటగాళ్లను చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచులలో ఆడకుండా నిషేధించడంపై స్పిన్నర్ ముత్తయ మురళీధరన్ అసహనం వ్యక్తం చేశాడు. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అంగీకరించడాన్ని తప్పుబట్టాడు. క్రికెట్ కు ఇదొక దుర్ధినమని వ్యాఖ్యానించాడు. ఆట సమయంలో ప్రభుత్వమే తమకు భద్రత ఇవ్వకపోతే తామే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. మురళీధరన్ ఆరవ సీజన్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News