: 26న సోనియా ముందుకు రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
రాష్ట్రంలో లోక్ సభ, శాసనసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ లో కసరత్తు ముమ్మురంగా కొనసాగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్, మరో అగ్రనేత వయలార్ రవితో కలసి ఈ రోజు కూడా ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై తమ కసరత్తును కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ కు ఢిల్లీ నుంచి పిలుపురాగా ఆయన బయల్దేరి వెళ్లారు. తుది జాబితాను ఈ నెల 26న సోనియా ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాన్ని కేటాయించనున్నారు. అలాగే జానారెడ్డి నల్గగొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ఆయన అందుకు పట్టుబడితే మిర్యాలగూడ స్థానాన్ని వేరొకరికి కేటాయిస్తారు. అలాగే, సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్ సభ టికెట్ ను ఇవ్వనున్నారు. దాదాపుగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు పూర్వపు స్థానాలే కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.