: తిరుపతి-హుబ్లీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో పొగలు
తిరుపతి నుంచి కర్ణాటకలోని హుబ్లీకి వెళుతున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో పొగలు లేచాయి. దీంతో, రైలును కడపజిల్లా ఒంటిమిట్ట వద్ద నిలిపివేశారు. పొగలను అరికట్టిన రైల్వే సిబ్బంది మరమ్మతు పనులను చేపట్టారు. ప్రాథమిక సమాచారం బట్టి ఎవరికీ అపాయం కలగలేదని తెలుస్తోంది.