: కాంగ్రెస్ వాళ్ళను చేర్చుకుంటే ఇతర పార్టీలకు ముప్పే: వెంకయ్య


బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు అన్నీ కుంభకోణాలే అని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని, కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటే ఇతర పార్టీలకు ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రాంతీయ పార్టీలు దేశాన్ని పాలించలేవని సూత్రీకరించారు వెంకయ్య. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పోవాలి... మోడీ రావాలి అన్న దానిపైనే చర్చ జరుగుతోందని చెప్పారు. ఇక, సీమాంధ్రకు న్యాయం జరగాలని పట్టుబట్టింది బీజేపీనే అని ఆయన ఉద్ఘాటించారు. ప్రత్యేక ప్రతిపత్తిని పదేళ్ళు పొడిగిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News