: కూడంకుళం ప్లాంట్ వచ్చె నెలలో ప్రారంభం: ప్రధాని
తమిళనాడులో నిర్మాణం పూర్తి చేసుకుని, ప్రజాందోళనలతో ఆగిపోయిన కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు హామీ ఇచ్చారు. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా మంగళవారం రాత్రి వీరిద్దరూ దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో సమావేశమయ్యారు.
కూడంకుళం యూనిట్ 1 ఎట్టి పరిస్థితులలోనూ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుందని ప్రధాని మన్మోహన్ ఈ సందర్భంగా చెప్పారు. యూనిట్ 3, 4 విషయంలోనూ ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.