: మరో 20 ఏళ్లు పోరాడినా సాధ్యం కానిది సోనియా వల్ల సాధ్యమైంది: జానారెడ్డి


మరో 20, 30 ఏళ్లు పోరాడినా సాధ్యం కాని తెలంగాణ కల ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ వల్ల సాకారమైందని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ తీసుకున్న కఠిన నిర్ణయం వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News