: రైనాకు కౌంటర్ వేసిన విండీస్ కెప్టెన్


స్పిన్నర్ల బౌలింగ్ లో సింగిల్స్ తీయడం విండీస్ బ్యాట్స్ మెన్ కు చేతకాదని టీమిండియా బ్యాట్స్ మన్ సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యపై ఆ జట్టు కెప్టెన్ డారెన్ సామీ దీటుగా స్పందించాడు. తమను భారీ షాట్లు కొట్టకుండా నిలువరించేందుకే రైనా అలా వ్యాఖ్యానించాడని పేర్కొన్నాడు. అయినా రైనా వ్యాఖ్యలు పట్టించుకోబోమని స్పష్టం చేశాడు. టీమిండియా స్పిన్నర్లను రక్షించుకునేందుకు రైనా తాపత్రయపడుతున్నాడని సామీ ఎద్దేవా చేశాడు. ఇక, గేల్ రేపటి మ్యాచ్ పై ఏమనుకుంటున్నాడని సామీని మీడియా ప్రశ్నించగా, పెద్ద పెట్టున నవ్వేస్తూ... 'నేను ఏసు ప్రభువును కాను, గేల్ ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు' అని చమత్కరించాడు. విండీస్ తరపున ఎప్పుడు ఆడినా గేల్ సామర్థ్యం మేరకు ఆడేందుకు ప్రయత్నిస్తాడని సామీ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News