: పవన్ వెనుక గద్దర్, చేగువేరా ఉన్నారనుకున్నాం... కానీ...: రాఘవులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ నేత రాఘవులు సెటైర్లు విసిరారు. పవన్ వెనుక గద్దర్, చేగువేరా ఉన్నారనుకుంటే... ఆయనేమో మోడీ, చంద్రబాబుతో చేతులు కలిపారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ లను ఓడించేందుకు తాము ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.