: సంజయ్ కు భార్య, పిల్లల కన్నీటి వీడ్కోలు
పెరోల్ గడువు నిన్నటితో ముగియటంతో నటుడు సంజయ్ దత్ ఈ రోజు ఎరవాడ జైలుకు తిరిగి వెళ్లాడు. భార్య మాన్యత, ఇద్దరు పిల్లలు, బంధువులు, స్నేహితులు సంజయ్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. గతేడాది డిసెంబర్ 21న నెల రోజుల పెరోల్ పై జైలు అధికారుల అనుమతితో సంజయ్ బయటకు వచ్చారు. అదే సమయంలో భార్య మాన్యత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో మరో రెండు సార్లు రెండు నెలల పెరోల్ పై ఈ నెల 21 వరకు బయట ఉన్నారు. 1993 ముంబయి వరుస పేలుళ్లలో నిందితుడైన సంజయ్ కు సుప్రీంకోర్టు గతేడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.