: లంక మిత్రదేశం కాదంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
శ్రీలంకను కేంద్ర ప్రభుత్వం మిత్రదేశంగా పరిగణించరాదని డిమాండు చేస్తూ తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఓ తీర్మానాన్ని నేడు ఆమోదించింది. ముఖ్యమంత్రి జయలలిత సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేక ఈలం కోసం లంకలోని తమిళులు, విదేశాల్లో ఉన్న తమిళుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని తీర్మానంలో పేర్కొన్నారు.