: జస్వంత్ సింగ్ కు సీటు కేటాయించలేకపోయాం: అరుణ్ జైట్లీ
బీజేపీ సీనియర్ నేత జస్వంత్ సింగ్ కోరుకున్న చోట సీటు కేటాయించలేకపోయామని ఆ పార్టీ అగ్రనేత అరుణ్ జైట్లీ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అపార అనుభవం కలిగిన జస్వంత్ సింగ్ ను పార్టీ గౌరవిస్తుందని, ఆయన అనుభవాన్ని పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపారు. అయితే బార్మెర్ లో సీటు కేటాయించడం విషయంలో తాము పునరాలోచించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో జస్వంత్ సింగ్ బీజేపీకి రాజీనామా చేయడం ఖరారైనట్టైంది.