: బీజేపీలో చేరేందుకు సిద్ధమైన కావూరి?


రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా అయోమయంలో పడిందో... కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వ్యవహారం కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ ను వీడాలా? వద్దా? అని కొద్ది రోజుల నుంచి ఆలోచిస్తున్న ఆయన, తాజాగా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. దాంతో, మరికొద్ది రోజుల్లో ఆయన కమలదళంలో చేరనున్నట్లు సమాచారం. అయితే, ఎంపీ టికెట్ పై కావూరికి బీజేపీ హామీ ఇవ్వలేదట.

  • Loading...

More Telugu News