: ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదు: కోదండరాం
వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనగానీ, ఉద్దేశంగానీ తనకు లేవని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. పోటీ చేయమంటూ పలు పార్టీలు తనని ఆహ్వానించాయని చెప్పిన ఆయన, వాటిని తిరస్కరించానని తెలిపారు. 'తెలంగాణ సమస్యలు, సవాళ్లు' అనే అంశంపై వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు కోదండరాం హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఉద్యోగుల పంపిణీ విషయంలో 317-డీని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.