: పెళ్లి నిరాకరించినందుకు ఆమె ముక్కు కోసేశారు
పాకిస్థాన్ లో మానవత్వం మచ్చుకైనా కనపడడం లేదు. ఆడదాన్ని విలాస వస్తువుగా చూస్తూ ఛాందసవాదం ముసుగులో అకృత్యాలకు పాల్పడుతున్నారు. మతం ముసుగులోని ఛాందసవాద ఉన్మాదంతో వివాహానికి నిరాకరించిందనే కారణంతో ఓ మహిళ ముక్కును కోసి వికారిగా తయారు చేశారు. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఫరీదా బీబీ(20) అనే యువతి తండ్రి బస్తీ షేర్వాలీలో జంషేడ్, నదీమ్ అనే వ్యక్తుల వద్ద కూలి పనులు చేస్తుంటాడు. ఫరీదా బీబీని జంషేడ్ తన కుమారుడితో పాటు మరో ఐదుగురికి ఇచ్చి పెళ్లిచేయాలని భావించాడు.
తన ప్రతిపాదనను ఆమె వద్దకు తీసుకెళ్లాడు. దానిని ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను ఇంట్లోకి ఈడ్చుకువెళ్లి చిత్రహింసలు పెట్టి ముక్కు కోసేశాడు. ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో లాహోర్ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. వారం రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని బహావల్ జిల్లా సెషన్స్ జడ్జిని ఆదేశించింది. నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.