: వీహెచ్ కు పూర్తి మద్దతు ఇస్తా: ఎంపీ అంజన్
హైదరాబాదు అంబర్ పేట శాసనసభ నియోజకవర్గం నుంచి రాజ్యసభ ఎంపీ వి.హనుమంతరావు పోటీ చేస్తే... ఆయనకు తన మద్దతు, సహకారం ఉంటాయని సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చరాదంటూ స్క్రీనింగ్ కమిటీకి తాను సూచించానని చెప్పారు.