: మలేసియా విమానంపై సోషల్ మీడియాలో జోకులు... మండిపడ్డ అక్షయ్
మలేసియా విమానం అదృశ్యం ఘటనపై ప్రపంచవ్యాప్తంగా సానుభూతి పవనాలు వీస్తుంటే... సోషల్ మీడియాలో దానిపై జోకులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందిస్తూ, 'గత రెండ్రోజులుగా చూస్తున్నాను, ఎంహెచ్370 విమానంపై కొందరు అసందర్భోచిత పోస్టింగ్స్ పెడుతున్నారు' అని మండిపడ్డారు. 'మిస్సింగ్ ఎంహెచ్370 ఫౌండ్' అని క్యాప్షన్ రాసి దానికి ఎంహెచ్ 370 నెంబర్ తో ఉన్న ఓ కారు ఫొటోను అటాచ్ చేశారని వివరించారు. ఇది మానవత్వం అనిపించుకోదని హితవు పలికాడు. ఇలాంటి వ్యవహారాల పట్ల సున్నితంగా వ్యవహరించాలని సూచించాడు.
ఇలాంటిదే మరో జోక్ ను బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఆ పోస్టింగ్లో, 'రజనీకాంత్ ఇక చాలు, నువ్వే గెలిచావు. ఆ విమానం ఎక్కడుందో చెప్పు' అని పేర్కొన్నారు.