: ఆ 40 సీట్లు గెలవకపోయినా మోడీ పీఎం అవుతాడు: వైగో
దేశంలో మోడీ ప్రభంజనం వీస్తోందని ఎండీఎంకే నేత వైగో అన్నారు. తమిళనాడు, పాండిచ్చేరిలోని మొత్తం 40 లోక్ సభ స్థానాల్లో బీజేపీ నెగ్గకపోయినా మోడీ ప్రధాని అవడం ఖాయమని ఆయన ఢంకా బజాయించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మిత్ర పక్షాలకు తప్ప మరే పార్టీకి ఓటేసినా ఫలితం ఉండదని వైగో స్పష్టం చేశారు.